Telangana Elections 2018 : ఆస‌క్తి రేపుతున్న కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ | Oneindia Telugu

2018-10-29 824

KCR is once again in the news. The busy pink bass was busy in the early electoral tactics and suddenly toured Delhi.
#KCR
#trs
#telangana
#telanganaelections2018

తెలంగాణ ఆప‌థ‌ర్మ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ఏం చేసినా రాజ‌కీయంగా సంచ‌నాల‌కు దారి తీస్తుంటుంది. అది ఫార్మ్ హౌస్ లో అల్లం పండించినా, ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో చేరిక‌లైనా, ఢిల్లీలో రాజ‌కీయ మంత‌నాలైనా ఆయ‌న మార్క్ క‌నినిస్తుంటుంది. ఇక దేశ రాజకీయాలు వాడి వేడిగా జ‌రుగుతున్న త‌రుణంలో ఆయ‌న అక‌స్మాత్తుగా ఢిల్లీ బాట ప‌డ‌తారు. చంద్ర‌శేఖ‌ర్ రావు ఢిల్లీ ప‌ర్య‌ట‌న వెన‌క మ‌ర్మం ఏంట‌ని ఎంత వెదికినా ఎవ‌రికి అంతుచిక్క‌కుండా ఉంటుంది. తాజాగా తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు, ఏపిలో ఐటీ దాడులు, మ‌హాకూట‌మి లో చ‌ర్చోప చ‌ర్చ‌లు, గ‌వ‌ర్న‌ర్ మూడు రోజులు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌, జ‌గ‌న్ పై దాడి సంఘ‌ట‌న‌ల‌తో ఉత్కంఠ‌గా మారిన రాజ‌కీయాల‌కు చంద్ర‌శేఖ‌ర్ రావు ఆక‌స్మిక ఢిల్లీ ప్ర‌యాణం మ‌రింత ఉంత్కంఠ‌కు గురిచేస్తుంది. కంటి, పంటి చెక‌ప్ ల మాటున మ‌త‌ల‌బేమైనా ఉందా అనే సందైహం రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌లుగుతోంది.

Videos similaires